ప్రసాదంలో విషం 5 మంది మృతి

BREAKING NEWS
BREAKING NEWS

బెంగుళూరు: రాష్ట్రంలోని చమరజనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసాదం తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రసాదంలో విషం కలవడంతో అది తిన్న వారిలో ఐదుగురు మృతి చెందారు. కాగా 72 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం సంచలనమైంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు కానీ, సదరు కార్యక్రమ నిర్వాహకులు కానీ స్పందించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.