ముంబై లో ఘోర ప్రమాదం : ఫ్లై ఓవర్ కూలి పలువురికి గాయాలు

ముంబై లో ఘోర ప్రమాదం : ఫ్లై ఓవర్ కూలి పలువురికి గాయాలు

ముంబై లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి 13 మందికి గాయాలు అయ్యాయి. నగరంలోని బాండ్రా కుర్లా కాంప్లెక్సు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ శుక్రవారం ఉదయం 4 :40 నిమిషాల ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంత షాక్ అయ్యారు. పెద్ద శబ్దం రావడం తో గాఢనిద్రలో ఉన్న స్థానికులు సడెన్ గా లేచారు. ఏంజరిగిందో అని భయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన 13 మంది కార్మికులను శాంతాక్రజ్ లోని వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి తరలించారు. ఫ్లై ఓవర్ కూలిన స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.