మూడ్‌ని మార్చే పూలు

Flowers that change the mood

ఆధునిక జీవనశైలి వలన కలిగే ఒత్తిడి, టెన్షన్‌లు మూడ్‌ను బాగా ఉండనివ్వకపోవటానికి ప్రధాన కారణాలు. కొన్నిసార్లు మన ఆరోగ్యం క్షీణించడం వల్ల కూడా మూడ్‌ పాడవుతుంది. ఇవన్నీ ఒకటైతే మన శరీరంలో ఉండే హార్మోన్లు చేసే మాయాజాలం ఇంకొక కారణం కూడా కావచ్చు. మూడ్‌ బాగులేకపోవటానికి కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ బాధపడటం వలన కూడా మూడ్‌ ఇంకా పాడవుతుంది. ఇటువంటి సమయాల్లో ఆలోచించవలసిందల్లా తిరిగి ఉత్సాహంగా మారడానికి ఎలా ప్రయత్నించాలి అనే. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే నచ్చిన పని చేయాలి. ప్రకృతితో మమేకమై ఉన్న వారి ఆరోగ్యసామర్థ్యాలు అత్యుత్తవంగా ఉంటాయని నిరూపతమైనదే. కనుక మన చుట్టూ పశుపక్ష్యాదులు, పూలు, మొక్కలు ఉంటే వాటి సానుకూల ప్రభావం మనసై పడి మన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూడ్‌ని తేలికపరిచే కొన్ని పూలను ప్రేమాభిమానాలకు చిహ్నంగా చెబుతారు. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతాయి. ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉన్నప్పటికీ, మూడ్‌ బాగుచేయడానికి ఇవన్నీ సమాన సహకారాన్ని అందిస్తాయి. గులాబీని చూడటం, దాని వాసన పీల్చడం వలన, మనలో మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మంచి భావనలు కలుగుతాయి. ఈ పూవు చూపుకు అందంగా ఉండటమే కాక, మన లో చాలా మంది చక్కనైన రుచి సువాసన కలిగిన కేమోమైల్‌ టీని గురించి తెలిసినవారే! ఈ టీని సేవించినంతనే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఈ పూల నుండి వెలికితీసిన సారంతో, నిద్రకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా పెద్దవారిలో పరిష్కారమవుతాయి.

Flowers

మూడ్‌ని తేలికపరచి, రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచే శక్తి వీటికి ఉంది. తులసిలో ఉండే లినోలోల్‌ దాని గొప్పదానికి కారణం. మన అభిజ్ఞ శక్తి దెబ్బతినకుండా చేస్తూ, ఒత్తిడితో పోరాడుతూ, మనలో సానుకూల భావనలు ఏర్పడడానికి ఇది తోడ్పడుతుంది. మనం ముందు చెప్పుకున్న మొక్కవలే, దీని పూలు చూపుకు, వాసనకు అంత ఇంపుగా ఉండవు. కానీ మన నాలుకలతో రుచి చూసినప్పుడు, రుచిలోని ఘాటుదనం మన మూడ్‌ని ఉత్సాహపరుస్తుంది. మనలో చాలా మందికి ఉల్లిని ఉపయోగించకుండా ఆహారాన్ని తయారు చేయడాన్ని ఊహించను కూడా ఊహించనులేరు. కోసిటప్పుడు కన్నీరు తెప్పించినప్పటికీ ఇది హృదయారోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉంటాయి. మెదడులోని హైపోథలామస్‌ నందు డోపమైన్‌ క్రియను పెంచి యాంటీడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. తులసికి మల్లే ఉల్లిలో మూడ్‌ని తేలికపరిచే గుణం, అవి మానవుని నాలుకపై ఉండే రుచిమొగ్గలను ప్రేరేపించడం వలన కలుగుతుంది. ఉల్లి మొక్కలను పెంచడం, సంరక్షించడం, మిగిలిన మొక్కలతో పోలిస్తే చాలా సులువైనది కనుక ఈ జాబితాలో ఫేవరేట్‌ ఇది! సోంపు ఎక్కువ పోషణ అవసరం లేకుండా తేలికగా పెంచుకోగలిగే మొక్కలలో ఇది ఒకటి. దీని పచ్చని ఆకులు పసుపు రంగు పూలతో కూడిన పుష్పగుచ్ఛం చూపుకు కన్నుల పండువగా ఉంటుంది. దీనిలోని ఔషధ గుణాలు మూడ్‌ను ఉత్తేజపరచడమే గాక రోగనిరోధకశక్తిని పెంచుతాయి. సూర్యకాంతిపువ్వు సువాసన పీల్చినా, మూడ్‌ ఉత్సాహంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పువ్వులోని ప్రకృతి సహజ సుగుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫినైల్‌ ఎలనిన్‌, మీ హార్మోన్లపై ప్రభావం చూపించి ఆనందపరుస్తుంది. చేలో మనసు చూసి తలలాడిస్తూ, పలకరిస్తున్నట్లు వరుసలలో ఉండే ఈ పూలను చూడగానే మన మనసు అనుకూల భావనలతో నిండిపోతుంది. మనలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది. ఈ పూలు కొండప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి తెలుపు రంగులో ఉంటూ, సమయం గడుస్తున్న కొద్దీ పూల అంచులు గులాబీరంగులోకి మార తాయి. ఈ పూల సౌందర్యానికి ముగ్ధులైన శాస్త్రవేత్తలు, ఇవి మూడును తేలికపరిచేందుకు ఉప యోగపడతాయని తేల్చారు. ఈ రోజుల్లో వీటిని ఆందోళనకు చికిత్సలో భాగంగా ఉపశమనకారిగా వాడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/