ఫ్లోరిడా: ఇంట్లో కాల్పులు ముగ్గురు మృతి

కుటుంబ కలహాలే కారణమని పోలీసులు నిర్ధారణ

In a house shooting in Miami, Florida
In a house shooting in Miami, Florida

US: ఫ్లోరిడా రాష్ట్రం మియామీలోని ఒక ఇంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మరో ఇద్దరు చిన్నారులు తప్పించుకుని ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన పొరుగింటి నుంచి పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందింది. ఇంట్లో నుంచి ఓ వ్యక్తి​ గాయాలతో బయటకు పరుగులు తీయడం చూశారు. పోలీసులు ఇంట్లో ఉన్న నిందితుడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/