ఒలింపిక్స్‌ నిర్వహణకు ఫ్లోరిడా సిద్ధం

ఫ్లోరిడా చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి జిమ్మి వెల్లడి

Florida prepares to host the Olympics


మయామి : ఈ యేడాది ఒలింపిక్స్‌ నిర్వహణకు టోక్యో వెనక్కి తగ్గితే ఆ క్రీడల నిర్వహణకు తాము సిద్ధమేనని ఫ్లోరిడా చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి జిమ్మి పాట్రొనిస్‌ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి తెలిపారు. ఈ మేరకు ఐఒసికి ఒక లేఖ రాస్తూ ఒకవేళ జపాన్‌ ప్రభుత్వం, ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ ఒలింపిక్స్‌ నిర్వహించలేమని భావిస్తే వాటిని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై వస్తున్న వదంతుల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాట్రొనిస్‌ ఆ ఆన్‌లైన్‌ లేఖలో తెలిపారు.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణ సరైనది కాదని జపాన్‌ ప్రజల్లో అత్యధికులు భావిస్తున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. క్రీడలను రద్దు చేయడం లేదా వాయిదా వేయకుండా తమకు అవకాశం కల్పించాలని ఫ్లోరిడా అధికారులు ఆ లేఖలో వివరించారు. కొవిడ్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటామని, అందుకు అవసరమై వాక్సిన్‌లనుకూడా సిద్ధం చేస్తామని తెలిపారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1