గోదావరికి మరోసారి భారీ వరదలు!

Godavari  river
Godavari river

అమరావతి: గోదావరి నదికి మరోసారి భారీ వరద పోటెత్తే అవకాశముందని ఏపీకి చెందిన ఆర్టీజీఎస్ హెచ్చరించింది. నేటి నుంచి రాబోయే 3 రోజులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే వరద తాకిడితో అల్లాడుతున్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తాజా వర్షాలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/