ఆల్మట్టిలోకి భారీగా చేరుతున్న వరద నీరు

jurala project
jurala project

గద్వాల: కృష్ణా నదిలో పశ్చిమ కనుమల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మరో 3 రోజుల్లో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు ఆల్మట్టి నిండే అవకాశాలున్నాయి. అయితే రోజుకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు ఆల్మట్టికి చేరుతోంది. ఆదివారం కూడా 1,14,035 క్యూసెక్కులు వచ్చి చేరాయి. ఆల్మట్టి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 91.62 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి కూడా 25,909 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ 22.1 టీఎంసీలకు చేరుకుంది. ఇదే తీరులో వరద కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండి జూరాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. మూడు రోజుల్లో ఆలమట్టి నిండితే తర్వాత ఒక్క రోజులో నారాయణపూర్‌ నిండుతుంది. ఆపై నారాయణపూర్‌ నుంచి వరద నీటిని వదిలితే రెండు రోజుల్లో జూరాలకు చేరుతాయి.

ˆ
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/