మంజీరా, శ్రీరాంసాగర్‌లకు వరద పోటు

తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు

Flood tide in Sriramsagar
Flood tide in Sriramsagar

Nizamabad: అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వానలతో జలవనరులు నిండుకుండలను తలపిస్తున్నాయి.

జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలకు చేరుతున్న వరద నీరుచేరుతున్నది.జిల్లాలోని బోధన్‌ మండలం సాలూర వద్ద మంజీర నది వరద నీటితో కళకళలాడుతోంది.

గత కొంత కాలంగా చుక్క నీరు లేక దర్శనం ఇచ్చిన నదిలో నాలుగు రోజులుగా కురిసిన వానకు వరద పోటెత్తింది. భారీ వ ర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శ్

రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ ఫ్లో 50,045 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లోలో 881 క్యూసెక్కులుగా ఉంది.

అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా…ప్రస్తుత నీటిమట్టం 1078.10 అడుగులు, 47.449 టీఎంసీలకు చేరింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/