ఫ్లిఫ్‌కార్టులో బొనాంజా సేల్‌

స్మార్ట్‌ ఫోన్లపై భారీ ఆఫర్‌

flipkart-mobile-bonanza-sale
flipkart-mobile-bonanza-sale

ముంబయి: ఆన్‌లైన్‌ దిగ్గజం ప్లిప్‌కార్టు బంపర్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను తీసుకువస్తోంది. మొబైల్స్‌ బొనాంజా పేరుతో ఐదు రోజుల పాటు వివిధ మొబైల్‌ ఫోన్లను అతి తక్కువ ధరకు అందించనుంది. అలాగే, ఈ ఆఫర్‌ ఉన్న రోజుల్లో ప్రతి రోజు సరికొత్త డీల్స్‌ అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకే మొబైల్‌ ఆఫర్‌ సేల్‌ ఫిబ్రవరి 17న తేదీన ప్రారంభమైన 21వ తేదీన ముగుస్తుంది. ఆపిల్‌, శాంసంగ్‌, వివో, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్‌, మిడ్‌-రేంజ్‌, బడ్జెట్‌ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చేసిన లావాదేవీలపై 10 శాతం తగ్గింపుదీనికి అదనం. రూ.15 వేల కేటగిరిలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ50, వివో జెడ్‌1 ప్రొలు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్‌1. రియల్‌మి ఎక్స్‌టీ రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్‌ తగ్గింపు ధరలలో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/