ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆఫర్‌

ఫ్లిప్‌కార్ట్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ పేమెంట్స్‌ గ్రూప్‌ హెడ్‌ రంజీత్‌ బోయనపల్లి వెల్లడి

Flipkart Group Health Insurance Offer
Flipkart Group Health Insurance Offer

Bangalore: కోవిడ్‌ నేపథ్యంలో తమ వినియోగదారుల కోసం ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆఫర్‌ ప్రకటించింది.

బజాజ్‌ అలియెంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు జారీ చేసిన ఇన్సూరెన్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

ఇన్సూరెన్స్‌ కవర్‌ రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ముందుగా ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యంగా ఉన్నామని డిక్లరేషన్‌ సమర్పించి పాలసీ తీసుకోవచ్చు. పాలసీలో గ్రూపు సభ్యులను తమకు కావాల్సిన విధంగా ఎంచుకోవచ్చు.

తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వినియోగదారులకు విలువైన పరిష్కారాలను అందించేందుకు నిరంతరం కృషిచేస్తామని ఫ్లిప్‌కార్ట్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ పేమెంట్స్‌ గ్రూప్‌ హెడ్‌ రంజీత్‌ బోయనపల్లి హామీ ఇచ్చారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/