పొగమంచు..ప్రయాణానికి తీవ్ర ఆటంకం

ఢిల్లీలో ఐదు విమానాలు దారి మళ్లింపు ..ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

Delhi
Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేయడంతో విమానాలు, రైళ్ల ప్రయాణానికి తీవ్ర ఆటంకం నెలకొంది. ఈ రోజు ఉదయం ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోవడంతోపాటు పొగమంచు నగరాన్ని కప్పేసింది. లైట్లు వేసినా 25 మీటర్ల దూరంల ఉన్న వాహనాలు కూడా కనపడని పరిస్థితి నెలకొంది. పగలు కూడా రాత్రిని తలపిస్తుండడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా నడుస్తుండడంతో ట్రాఫిక్ జాం అవుతోంది. ఐదు విమానాలను విమానాశ్రయం అధికారులు దారిమళ్లించారు. ఇక రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. 22 రైళ్లు ఇప్పటికే 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/