ఛార్జీల ‘విమానం’ మోత!

Flight
Flight

ఛార్జీల ‘విమానం’ మోత!

సంక్రాంతికి ప్రత్యేక పెంపు
ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల బాదుడు!

ప్రయాణీకులతో కిక్కిరిపోతున్న స్టేషన్లు, బస్టాండ్లు

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ నుంచి సొం తూళ్లకు వెళ్లే ప్రయాణీకులపై అదనపు ఛార్జీల బాదుడుకు గురవుతున్నారు. ప్రధానంగా విమాన ఛార్జీల ధరలు ఈ పండుగకు చుక్కలనంటాయి. 10 రేట్లు వీటి ఛార్జీలు పెరగడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌-బెంగళూరు విమాన టికెట్లు రూ.70 వేలు, హైదరాబాద్‌-విజయవాడకు రూ.50 వేలు, హైదరాబాద్‌-విశాఖపట్నం 40 వేలను ప్రస్తుతం విమాణయాన సంస్థలను ప్రయాణీకుల ముక్కుపిండి వస్తూలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సుల్లో 50% అదనంగా ఈ పం డగ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణీకుల నుండి వసూలు చేస్తూన్నారు. ఇవికాకుండా ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఈ సంక్రాంతికి ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఈనేపథ్యంలో.. సంక్రాంతి పండుగకు స్వగ్రాలకు వెళ్లే లక్షలాది ప్రయాణీల సౌకర్యార్థం టిఎస్‌ఆర్టీసీ 5200లకు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

బుధవారం నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణీకుల సందడి మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నగరం నలుమూలల నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జేబిఎస్‌ బస్‌స్టేషన్లు..సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి వేల సంఖ్యలో ప్రయాణీకులు బయలుదేరటంతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి ప్రత్యేక బస్సులతో ప్రయాణీకులకు ఛార్జీలు భరించలేనంతగా ఉన్నాయని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది 2018 జనవరిలో సంక్రాంతి సందర్బంగా 5200 ప్రత్యేక బస్సులను టిఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. ఈసారి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే ఊహించి 5300 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. ఎపిఎస్‌ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఎల్‌బినగర్‌లోని చింతలకుంట నుండి నడపడానికి ఏర్పాట్లు చేస్తుంది.

సంక్రాంతి పండుకు ముందు రోజులైన 12వ తేదీ రెండో శనివారం, 13వ తేదీ ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకు కలిసి రానున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 9వ తేదీ నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించారు. 11, 12, 13 తేదీల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంటుందని భావించిన టిఎస్‌ఆర్టీసీ అధికార యంత్రాంగం ఆరోజున కనీసం వేయికి తక్కువ కాకుండా ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. అవసరమైతే వీలనైనన్నీ బస్సులను సిద్దంగా ఉంచుకోవాలని కూడా నిర్ణయించారు. ఈసారి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ శాఖలు సమన్వయంతో బస్సులను నడపటానికి ఏర్పాట్లు చేశాయి.