హైదరాబాద్ నుండి మంచిర్యాల కు పాకిన ప్లెక్సీ వార్..

హైదరాబాద్ లో బిజెపి జాతీయ సమావేశాలు మరోసారి బిజెపి – తెరాస ల మధ్య వార్ ను మరింత వేడెక్కించింది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హైదరాబాద్ రాబోతుండడం తో బిజెపి నేతలంతా భాగ్యనగరాన్ని మొత్తం కమలమయం చేయాలనుకున్నారు కానీ అంతకంటే ముందే టీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాని మోడీ పర్యటించే బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, HICC నోవాటెల్ ప్రాంతాల్లో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను బీజేపీ సంప్రదించడంతో హోర్డింగ్స్ అన్నీ టీఆర్ఎస్ ముందుగానే బుక్ చేసుకుందని వెల్లడించాయి.

ఇక నాల్గు రోజుల క్రితం బీజేపీ ఆఫీస్ బయట కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్, సాలు దొర- సెలవు దొర అంటూ డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ పెట్టారు. దీనికి కౌంటర్ గా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ సంపకు మోడీ అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు మంచిర్యాల కు కూడా ప్లెక్సీ వివాదం అంటుకుంది. మంచిర్యాల కొంతమంది బిజెపి కి వ్యతిరేకంగా ప్లెక్సీ లు ఏర్పటు చేసారు. మొత్తం మీద మోడీ రాక ఫై ఇరు నేతలు ప్లెక్సీ లతో వార్ పెంచుతున్నారు.