అంబాలా చేరుకున్న రఫేల్‌ యుద్ధ విమానాలు

మిలటరీ చరిత్రలో నవ శకం

first squadron of Rafale jets will be stationed in Ambala

న్యూఢిల్లీ: భారత అమ్ముల పొదిలో అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు దిగాయి. ఫ్రాన్స్ నుంచి బయలు దేరిన ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా దిగినట్లు రక్షణశాఖ తెలిపింది. భారత గడ్డపై రఫేల్ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలయిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ శక్తి సామర్థ్యాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఆయన అన్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్‌ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/