హైదరాబాద్ లో దీపావళి వేడుకల్లో ఐదుగురు మృతి

Diwali celebrations

సోమవారం దేశ వ్యాప్తమగు దీపావళి వేడుకలు అంబరాన్ని తాకాయి. చిన్న , పెద్ద ఇలా అంత కూడా దీపావళి వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కాగా ఈ దీపావళి వేడుకలు పలు కుటుంబాల్లో విషాదాలు నింపాయి. హైదరాబాద్ లో దీపావళి టపాసులు కాల్చే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందగా , 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడి వారిలో ఎక్కువమంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

వీరందరూ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువమంది చిన్నారులేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 12 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అలాగే, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. టపాసులు కాల్చే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించప్పటికీ, ఆ జాగ్రత్తలు పాటించకుండా ఇలా ప్రాణాల మీదకు తీచుకుంటారు.