తెలంగాణ లో ఈరోజు కొత్తగా ఎన్ని ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయంటే..

first-omicron-case-found-in-goa

దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ హలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఓమిక్రాన్ కేసులు భారీగానే బయటపడుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 12 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా..మంగళవారం కొత్తగా 07 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67కు చేరింది. వీరందరిని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 10 మంది కోలుకున్నారు.

ఈరోజు మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఇప్పటికే ప్రభుత్వం 144 సెక్షన్ కూడా విధించింది. కాగా వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని గురువారం డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చూస్తుంటే త్వరలో కరోనా థర్డ్ వేవ్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.