విశాఖలో ఐదు కరోనా అనుమానిత కేసులు

ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమార్తెకు కరోణా లక్షణాలు

corona virus
corona virus

విశాఖపట్నం: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) బాధిత కేసులు రోజురోజూకు పెరుగతున్నాయి. ఈనేపథ్యంలో విశాఖలో నిన్న ఒక్క రోజులోనే ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. వీరంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే. ఓ కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమార్తె కొద్ది కాలం కిందట కౌలాలంపూర్ వెళ్లి, మంగళవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వీరు బాధ పడుతున్నట్టు గుర్తించిన విమానాశ్రయ అధికారులు… వారిని వెంటనే నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ వార్డుకు తరలించారు. మరోవైపు, గత నెల 28న బహ్రెయిన్ నుంచి విశాఖకు వచ్చిన 23 ఏళ్ల ఓ యువతి, ఆమె స్నేహితుడు కూడా గత రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. దీంతో, వీరిని కూడా కరోనా వార్డులో చేర్చారు. వీరి ముక్కు, గొంతు నుంచి తీసుకున్న నమూనాలను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు పంపించారు. రెండు రోజుల్లో వీరి రిపోర్టులు రానున్నాయి.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/