లాక్‌డౌన్‌లోనూ ఫిట్నెస్

వ్యాయామం- ఆరోగ్యం

Exercise

రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు, పార్కుకు, జిమ్‌కు, ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వెళుతుంటారు.

లాక్‌డౌన్‌ వల్ల ఇవేవి ప్రస్తుతం అందుబాటలో లేనందున ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇంట్లో పెద్ద వారు ఉంటే రోజుకు అరగంట సేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసిక ఉల్లాసంగా ఉంటారని డబ్యూహెచ్‌ఒ తెలిపింది.

మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహదపడతాయని పేర్కొంది.

కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచి పనిచేస్తున్న వారు పని మధ్యలో కొంత విరామమిస్తూ లేచి నిలుబడడం, శరీరాన్ని నిటారుగా చేసుకోవడం వంటివిచేయాలి.

ప్రపంచాని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశదేశాలకు వ్యాపించి ఊహించిన పరిస్థితులను సృష్టిస్తున్నది.

కంటికి కనిపించిన శత్రువుతో పోరాడుతున్నామంటూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

దీంతో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు, పేదల నుంచి ఉన్నవారి వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇంటికి ఇంటికి పరిమితమయ్యేలా చేశాయి.

ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న ఈ వైరస్‌ వల్ల చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకుతున్నందున ప్రజలందరు ఇంటికే పరిమితమయ్యారు.

మనదేశంలో ఈ లాక్‌డౌన్‌ దాదాపు కొనసాగుతూనే ఉంది. అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా ఉరుకు పరుగుల జీవితం నుండి చాలా మంది ఇంటి పట్టున ఉండి పనులు చేసుకుంటున్నారు.

ఇలాంటప్పుడు దినచర్యలో కొంత మార్పు రావడం సహజం. అందువల్ల ఇబ్బందులు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఫిట్‌గా తయారవ్వాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఇంటి పనులు చేసుకుంటూనే దినచర్యలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు, పార్కుకు, జిమ్‌కు, ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వెళుతుంటారు.

లాక్‌డౌన్‌ వల్ల ఇవేవి ప్రస్తుతం అందుబాటలో లేనందున ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇంట్లో పెద్ద వారు ఉంటే రోజుకు అరగంట సేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసిక ఉల్లాసంగా ఉంటారని డబ్యూహెచ్‌ఒ తెలిపింది.

మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహదపడతాయని పేర్కొంది.

కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచి పనిచేస్తున్న వారు పని మధ్యలో కొంత విరామమిస్తూ లేచి నిలుబడడం, శరీరాన్ని నిటారుగా చేసుకోవడం వంటి చేయాలి.

ఇంట్లో పని చేయడమే కదాని ఎలా పడితే అలా కూర్చోకుండా సరైన పద్ధతిలో కూర్చుని పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ఇంటి వద్ద పనిచేసే వారికి వ్యాయామం చేయడానికి కొన్ని మార్గాలు అనుసరించడం మంచిది. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలో కనిపిస్తున్నది. ఏది కావాలన్ని గూగుల్‌ను అనుసరిస్తున్నాము.

వ్యాయామానికి సంబంధించి యూ ట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు ఉంటాయి. ఇంట్లోనే ఉండి ఫిట్‌నెస్‌ పొందాలి అనుకునే వారు ఈ వీడియోలు పెట్టుకుని వ్యాయామం చేయవచ్చు.

ప్రస్తుతం చాలా మంది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లు ఎన్నో వీడియోలను షేర్‌ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండటాని చేస్తున్న ప్రయత్నాలను ఈ లాక్‌డౌన్‌ ద్వారా చక్కగా వినియోగించుకోవచ్చు.

కేలరీలను కరిగించుకునేందుకు మరో చక్కని మార్గం డాన్స్‌చేయడం. ఇంట్లో ఉంటూనే ఇష్టమైన పాటలు పెట్టుకుని డాన్స్‌చేయవచ్చు.

ఇందువల్ల ఆనందంతో పాటు శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ఉల్లాసం పొందటమే కాక ఫిట్‌నెస్‌ కూడా లభిస్తుంది.

ఆటలు శరీరానికి మంచి వ్యాయామం. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బయటికి వెళ్లి ఆడేందుకు కుదరదు.

కాబట్టి వీడియోగేమ్స్‌ ఆడుకుంటూ మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఆడటం వల్ల ఫిజికల్‌ యాక్టివిటీ ఉంటుంది. దీంతో ఇష్టమైన ఆటలాడుతూ వ్యాయామం కూడా చేయవచ్చు.

ఇంటి డాబాపైన స్కిప్పింగ్‌ రోప్‌తో చక్కగా ఆడుకోవచ్చు.

ఇందువల్ల ఆటతో పాటు శరీరానికి మంచి వ్యాయామం ఉంటుంది. స్కిప్పింగ్‌ వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఇంట్లో చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్‌ రోప్‌ను బెస్ట్‌గా చెప్పవచ్చు.

ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో మజిల్‌ స్ట్రన్త్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది.
దీనివల్ల ఫిట్‌గా తయారవుతారు.

ఇలాంటి వ్యాయామాలతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఇలాంటి వాటితో లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.

ఇంటి నుంచి బయటకు రాకుండా బాధ్యతాయుత పౌరులు అని కూడా అనిపించుకోవచ్చు.

మరి మీరు చేస్తారు కదా!

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/