ముంబయి ఎయిర్‌ పోర్టులో చేపల సందడి

Catfish land on Juhu airport
Catfish land on Juhu airport

ముంబయి: ముంబయి జాహూ ఎయిర్‌పోర్టులో ఈరోజు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అయితే భారీగా కురుస్తున్న వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడగా మరోవైపు వరుదకు కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతారణం కనిపించింది. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతంలోని సమీప సరస్సు, నల్లా నుండి ఈ విమానాశ్రయంలోకి చేపలు ఇతర జలచరాలు కొట్టుకొచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టు దగ్గర జలచరాలకు నిలయంగా మారింది. దాదాపు 3 అడుగుల చేపలు, అందునా ఎక్కువగా క్యాట్ ఫిష్ రకానికి చెందినవి రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పైలట్లు ఆసక్తిగా తిలకించారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/