మత్స్యకారుడ్ని లక్షాధికారిని చేసిన చేప

సముద్రపు వేటలో మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. ఆలా చిక్కిన చేపలు వారిని రాత్రిరాత్రికే లక్షాధికారులను చేస్తుంటాయి. తాజాగా ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రాకు చెందిన వ్యక్తిని అలాగే లక్షాధికార్ని చేసింది ఓ చేప. చందానిపాల్‌లో 32 కిలోల బరువున్న చేప… ఓ మత్స్యకారున్ని రాత్రికి రాత్రే ధనవంతున్ని చేసింది. తలచువాకు చెందిన ఓ మత్స్యకారుడు తన వలలో చిక్కిన ఈ 32 కిలోల చేపను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యాపారికి రూ. 3.20 లక్షలకు విక్రయించాడు.

తెలియా అని పిలవబడే ఈ అరుదైన చేప.. సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశ తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఒక రకమైన క్రోకర్ చేప. ఈ చేప ఔషధ విలువలకు ఇండోనేషియా, సింగపూర్ మరియు మలేషియాలో భారీ డిమాండ్ ఉంది. అంతేకాకుండా సింగపూర్‌లో వైన్ శుద్ధి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే ఈ చేప కు అంత ధర పలికింది.