జూన్‌ 8,9 తేదీలో చేప ప్రసాదం పంపిణీ

Fish Medicine
Fish Medicine

హైదరాబాద్‌: ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు అందించే చేప ప్రసాదాని గత 173 సంవత్సరాల నుండి బత్తిని హరినాథ్‌గౌడ్‌ కుటుంబీకులు వంశపారంపర్యంగా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా జూన్‌ 8, 9 తేదీలో నాంపల్లి ఎగ్జిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్‌ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో తరువాత మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ ఆదేశం మేరకు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తిరిగి జూన్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని వివరించారు. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని గత సంవత్సరం కంటే మెరుగ్గా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించామన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/