కేంద్ర ఖజానాకు పెరగనున్న ఆర్థికలోటు

2020 సంవత్సరంలో 3.6% అంచనా

fitch ratings
fitch ratings

న్యూఢిల్లీ: ఫిట్జ్‌ రేటింగ్స్‌సంస్థ భారత్‌ 2020 ఆర్థికసంవత్సరం ఆర్థికలోటు జిడిపిలో 3.6శాతంవరకూ ఉంటుందని అంచనావేసింది. అంతేకాకుండా వ్యయం వృద్ధి కూడా కొంతమేర తగ్గుతుందని అంచనావేసింది. 13.7శాతంనుంచి 12.1శాతానికి ప్రభుత్వ వ్యయం తగ్గవచ్చని అంచనావేసింది. ప్రభుత్వం ఆర్థికవృద్ధికి ఎక్కువగా మౌలికవనరుల వ్యయం పెంచుతుందని కూడా బేరీజువేసింది. కార్పొరేట్‌ పన్నులను తగ్గించినప్పటికీ ఆర్థిక వృద్ధి మందగమనంతోనే ఉంది. ఫిట్చ్‌ ఆర్ధికలోటు రాబడుల వృదిధ కొంతమేర తగ్గింది. కేంద్ర బడ్జెట్‌లో అంచనాలు చేరుకోలేకపోవచ్చని అంచనా. జిఎస్‌టి, సేవపన్నులు, కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు కొంతమేర అంచనాలకు చేరకపోవడమే ఇందుకారణమని తెలుస్తోంది. ఆర్థికలోటు జిడిపిలో 3.6శాతంగా ఉంటుందని, అంతకుముందున్న 3.4శాతంనుంచి మరికొంతపెరుగుతుందని అంచనావేసింది. ప్రభుత్వం వాస్తవానికి లోటును జిడిపిలో 3.3శాతానికి తెస్తామని చెప్పినా పన్ను రాబడుల్లో తగ్గుదల కనిపించడంతో లోటు పెరుగుతుందనే అంచనావేసింది. ఆర్థికవృద్ధి మందగించడానికి ప్రధాన కారణం పన్నులరాబడి తగ్గడమేనని చెప్పాలి. సెప్టెంబరు 20వ తేదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ఆదాయపు పన్నులను దేశీయ కంపెనీలకు 30 నుంచి 22శాతానికి తగ్గించింది. మొత్తంగా అమలయ్యే పన్నురేటు అన్ని అదనపు సుంకాలు కలిపి 25.2శాతంగా వెల్లడించింది. .
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/