నేటి నుంచి తొలి టెస్టు

అంటిగ్వా : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌కు నంబర్‌వన్ ర్యాంక్ జట్టు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రవేశ పెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్, వెస్టిండీస్‌లు తమ ఆరంభ మ్యాచ్‌ను అంటిగ్వాలో ఆడనున్నాయి. ఇరు జట్లకు ఈ చాంపియన్‌షిప్‌లో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. ఇటీవల ముగిసిన ట్వంటీ20, వన్డే సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో టెస్టు సమరంలో భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక, ఇప్పటికే రెండు సిరీస్‌లను చేజార్చుకున్న ఆతిథ్య వెస్టిండీస్ జట్టు కనీసం టెస్టుల్లోనైనా మెరుగైన ఆటను కనబరచాలని భావిస్తోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/