మొదటి స్థానంలో విరాట్‌.. బుమ్రా

Virat Kohli, Jasprit Bumrah
Virat Kohli, Jasprit Bumrah

దుబా§్‌ు: ఐసిసి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టీమిండియా బౌలింగ్‌ బృందం తురుపుముక్క జన్‌ప్రీత్‌ బుమ్రా తమ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ 895 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా 797 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ 740 పాయింట్లతో రొండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడను 4వ స్థానానికి నెట్టి అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ ముజీబుర్‌ రహ్మాన్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత యువ సంచలనం హార్డిక్‌ పాండ్యా 10వ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్‌ స్టార్‌ బెన్‌ స్టోక్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/