యూకే లో ఓమిక్రాన్ ఫస్ట్ మరణం

omicron variant

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా, యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదయ్యింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా వెల్లడించారు. ఒమిక్రాన్ బారినపడ్డ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు సోమవారం తెలిపారు.

‘బాధాకరం.. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ఓ బాధితుడు మృతిచెందాడు’ అని బోరిస్ జాన్సన్ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి నుండి ఇక్కడ ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం తో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మొదటి మరణం నమోదు కావడం తో ఇంకాస్త భయపడుతున్నారు.

ప్రజలంతా బూస్టర్ డోసు వేసుకోవాలని డాక్టర్స్ చెపుతున్నారు. పశ్చిమ లండన్‌లోని పాడింగ్టన్‌లో ఉన్న ఓ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన బోరిస్ మాట్లాడుతూ.. ఒమైక్రాన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒమైక్రాన్ కారణంగా తొలి మరణం కూడా సంభవించినట్టు చెప్పారు.

ఒమైక్రాన్ వేరియంట్‌పై ఏవైనా అపోహలు ఉంటే పక్కన పెట్టాలని అన్నారు. ఒమైక్రాన్ ఏం చేస్తుందిలే.. అదో చిన్న వేరియంట్ అని, స్వల్ప లక్షణాలే ఉంటాయని తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఈ నెలాఖరు నాటికి దేశప్రజలందరికీ బూస్టర్ డోసు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.