ఆ 40 మందిని అక్కడే ఉంచండి: అమెరికా

Quarantined Cruise Ship in Japan
Quarantined Cruise Ship in Japan

అమెరికా: జపాన్ నౌకలో ఉన్న 40 మంది అమెరికా జాతీయులకు ప్రాణాంతక కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారెవరినీ ప్రస్తుతానికి యూఎస్ లో కాలుమోపనివ్వ బోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నౌకలో మొత్తం 400 మందికి పైగా అమెరికన్లు ఉండగా, వారిని యూఎస్ కు తీసుకుని వెళ్లేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానం చేరుకుంది. అయితే, కొవిడ్ -19 సోకిన వారిని మాత్రం అక్కడే ఉంచనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,770కి చేరుకుంది. తాజాగా, నిన్న మరో 105 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 వేల మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 70 వేలకు పైగానే ఉండగా, దాదాపు 11 వేల మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయినట్టు చైనా అధికారులు వెల్లడించారు. ఇక తైవాన్ లో 20 మందికి వైరస్ సోకగా, ఒకరు మరణించారు. మకావులో 10 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/