గ్రామంలోనే తొలి మహిళా ప్రభుత్వ ఉద్యోగి

గ్రామంలోనే తొలి మహిళా ప్రభుత్వ ఉద్యోగి
Seeta behera

కాలేజీకి యూనిఫాంలో వెళ్లాలి. అక్కడ అందరూ అబ్బాయిలే. అమ్మాయి దుస్తుల్లో కాకుండా అబ్బాయిలా ప్యాంటు, చొక్కా వేసుకుని మరీ కాలేజీకి వెళ్లేది. అంతమంది అబ్బాయిల్లో ఎలా ఉండగలుగుతుందోనని అంతా అనుకునేవారు. అయినా సీత అవేమీ పట్టించుకోకుండా అబ్బాయిల్లాగే కాలేజీకి వెళ్లేది. కొంతమంది పోకిరీలు ఆమెను ఎంత గేలిచేసినా పట్టించుకునేది కాదు. చదువును ఆ విధంగా కొనసాగించిన సీత మొత్తానికి కోర్సు పూర్తి చేసి గ్రామంలోనే మొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామంలో మరో రికార్డు సృష్టించింది.

ఒడిశాలోని సోరస్‌ గ్రామంలోని అమ్మాయిలకు సీతా బెహరా ఆదర్శనంగా నిలిచింది. సీతా బెహరా అంటే ‘ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ రాణిగా చెప్పుకుంటారు. ఇంట్లో చిన్న కూతురు. వారి కుటుంబంలో నలుగురు అక్కాచెల్లెళ్లలో సీత చిన్నది. ఒక సోదరుడు వారిలో సీత, ఆమె సోదరుడు మాత్రమే చదువుకున్నారు. సంతానంలో చిన్న కూతురు అయినా ఇంటి ఆమే పెద్ద దిక్కుగా మారింది. ఆమె సోదరుడు చదువుకునేందుకు ఇంట్లో సహకారం లభించింది. కాని సీత బెహరాకు చదువుకునేందుకు సోదరుడికి దక్కిన ప్రోత్సాహం ఆమెకు దక్కలేదు. అయినప్పటికీ నిరాశ పడకుండా కష్టపడి చదివి గవర్నమెంట్‌ ఉద్యోగం సాధించింది. సీతా చాలా ధైర్యస్తురాలు. ఏ పనికైనా వెనకడుగు వేయదు. ఆ పట్టుదల చదువులోను కొనసాగించింది. తమ్ముడి పుస్తకాలతోనే గ్రామంలోని పాఠశాలలో చదివింది. సాధారణంగా అబ్బాయిలు చదువుకునేందుకు తల్లిదండ్రులు ఏ కష్టమైనా చేసి చదివించాలనుకుంటారు. కాని అమ్మాయిల చదువు దగ్గరికి వచ్చేటప్పటికీ అంతగా ఆసక్తి చూపించరు. సీత కుటుంబంలో అదే జరిగింది. పై చదువులు చదివేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

అయినా సరే వారిని ఒప్పించి దేశంలోనే రెండో అతిపెద్ద ఐటిఐలో ఉచిత ప్రవేశాన్ని సాధించింది చూపింది. సీతా బెహరా. చదువుకు కొనసాగించేందుకు ఎలాంటి ఖర్చు లేకపోవడంతో తల్లిదండ్రులను ఆమెను వ్యతిరేకించలేదు. దాంతో గ్రామంలోనే ఉన్నత చదువుకు చదివుతున్న మొదటి మహిళగా సీత నిలిచింది. కాలేజీకి యూనిఫాంలో వెళ్లాలి. అక్కడ అందరూ అబ్బాయిలే. అమ్మాయి దుస్తుల్లో కాకుండా అబ్బాయిలా ప్యాంటు, చొక్కా వేసుకుని మరీ కాలేజీకి వెళ్లేది. అంతమంది అబ్బాయిల్లో ఎలా ఉండగలుగుతుందోనని అంతా అనుకునేవారు.

అయినా సీత అవేమీ పట్టించుకోకుండా అబ్బాయిల్లాగే కాలేజీకి వెళ్లేది. కొంతమంది పోకిరీలు ఆమెను ఎంత గేలిచేసినా పట్టించుకునేది కాదు. చదువును ఆ విధంగా కొనసాగించిన సీత మొత్తానికి కోర్సు పూర్తి చేసి గ్రామంలోనే మొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామంలో మరో రికార్డు సృష్టించింది. ఒడిశా పవర్‌ ట్రాన్సిమిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగం సంపాదించి తానేమిటో నిరూపించుకుంది. ప్రస్తుతం తమ కుటుంబానికి ఆమే ఆధారయ్యాంది. ఆడపిల్ల అయినా కర్త్వయ నిర్వహణలో దేనికి వెనకడుగు వేయని సీతగా పేరు తెచ్చుకుంది.

30 అడుగుల టవర్‌పైకి ఎక్కి చాలా ఈజీగా పని చేస్తుంది. సీత పనిని గుర్తించిన ఒడిశా నైపుణ్య అభివృద్ధి అథారిటీ ఆమెను ‘ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ రాణిగా ప్రశంసించి, సత్కరించింది. తన విజయానికి కాలేజీ యాజమాన్యమే కారణమంటుంది. మొత్తం కోర్సుకు కావలసిన మొత్తాన్ని వాళ్లే భరించి, హాస్టల్‌ ఫీజు కూడా మినహాయించారు.

వాటితో పాటు వివిధ రకాల మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశాన్ని కూడా కల్పించారు. ఇందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం సీతా బెహరా తమ గ్రామంలోని అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. అంతేగాక ఆడపిల్లలకు చదువ్ఞ అవసరమేనని నిరూపించి గ్రామంలోని అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/