ఫ్రాన్స్‌నుండి బ‌య‌లుదేర‌నున్న రాఫెల్ యుద్ధ విమానాలు

దశల వారీగా దేశానికి చేరుకోనున్న విమానాలు

Rafale fighter jet
Rafale fighter jet

న్యూఢిల్లీ: ఈరోజు ఫ్రాన్స్‌ నుండి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్‌కు బ‌య‌లుదేరి రానున్నాయి. ఆ దేశంలోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు టేకాఫ్ అవుతాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఆగుతాయి. కాగా, తొలిదశలో భాగంగా వస్తోన్న ఈ ఐదు యుద్ధ విమానాల్లో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ విమానాలు దశల వారీగా దేశానికి చేరనున్నాయి. ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు చేరుకోవాల్సి ఉంది. అనుకున్న సమయానికే అవి చేరుతున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/