కరోనా వైరస్‌…సెలవులు పొడిగింపు

Coronavirus in China
Coronavirus in China


బీజింగ్‌: వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చైనా 6,033 కోట్ల యువాన్లు (దాదాపు 900 కోట్ల డాలర్లు) కేటాయించింది. వైరస్‌ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చైనీస్‌ కొత్త సంవత్సర సెలవులను ఫిబ్రవరి 2 వతేదీ వరకూ పొడిగించింది. వుహాన్‌, తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు తెరవలేదు. ఇళ్ల నుంచే విధులు విధులు నిర్వహించాలని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను కోరాయి.. ఇప్పటివరకు 2,744 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఒక్కరోజే 769 కొత్త కేసులు నమోదయ్యాయి. హ్యూబె ప్రావిన్స్‌లో 24 మంది మరణించారు. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద మొత్తం 5,794 అనుమానిత కేసులు నమోదు కాగా 51 మంది ఈ ఇన్ఫెక్షన్‌ బారి నుండి కోలుకున్నట్లు హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. వుహాన్‌ నుంచి వచ్చిన వారి ద్వారా ఈ వైరస్‌ థాయిలాండ్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, అమెరికా వంటి పది దేశాలకు విస్తరించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/