జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు…పోలీసు కాల్పులు
ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఘటన

రాంచీ: జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న రెండో దశ పోలింగ్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలోని 36వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు. దీంతో, భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై ఏడీజీపీ మీనా స్పందిస్తూ.. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారన్నారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని చెప్పారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/
సం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/