నిజాంపేట పరిధిలో అగ్ని ప్రమాదం

హోలిస్టిక్‌ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

fire in holistic hospital
fire in holistic hospital

Hyderabad: నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్‌ ఆస్పత్రిలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో అక్కడ 35 మందికి పైగా రోగులు ఉన్నట్లు తెలిసింది .దీంతో అందరూ భయాందోళనతో ఆసుపత్రి అద్దాలను బద్దలు కొట్టి రోగులను బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

వార్షిక బడ్జెట్ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/budget/