గుజరాత్‌లో జీఐడీసీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

గుజరాత్‌లో జీఐడీసీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
fire accident gujarat

గుజరాత్‌: అహ్మదాబాద్‌లోని సనంద్‌ ప్రాంతంలో గల జీఐడీసీ ( గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో నల్లటి పొగ దట్టంగా కమ్ముకుంది. ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వగా సుమారు 25 ఫైర్‌ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/