తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

telangana-express
telangana-express

హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి న్యూడిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఎసి బి1, స్లీపర్ క్లాస్ ఎస్ 10 బోగీకి వ్యాపించాయి. ఆ సమయంలో ట్రైన్ వేగంగా వెళుతుండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. వెంటనే గుర్తించిన రైలు సిబ్బంది డిల్లీ సరిహద్దు బాలగఢ్ రైలును నిలిపివేసి నిప్పంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. మరో గంటలో ట్రైన్ గమ్యానికి చేరుతుందనగా ఫరీదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/