ఆయిల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

fire accident in anaparthy
fire accident in anaparthy

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరారామచంద్రాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఫ్యాక్టరీ లోని ఆయిల్‌ మొత్తం మంటల్లో ఆహుతయిపోయింది. ఈ రోజు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగంతో గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. కాకినాడ, మండపేట, రాజమండ్రి సహా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు అన్ని అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు చాలా సేపటినుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో శుద్ధి చేస్తూ ఉంటారు. కాగా కొంత కాలంగా తరచూ ఇబ్బంది పెడుతున్న ఈ ప్లాంట్‌లో ఆధునీకీకరణ పనులు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా ఈ ఫ్యాక్టరీలో తిరిగి ఆయిల్‌ శుద్ధి పనులను ప్రారంభించారు. ఇంతలోనే ఈ భారీ ప్రమాదం సంభవించిందని అక్కడివారు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/