ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందింది. ముండ్కా మెట్రో స్టేషన్‌లోని పిల్లర్ నంబర్ 544 సమీపంలోని భవనంలో మంటలు వ్యాపించాయి. సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు శ్ర‌మిస్తోంది. మూడు అంతస్తుల బిల్డింగ్‌లోని మొదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో మంటలు అంటుకున్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ కంపెనీ యజమాని పోలీసుల అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.