గోషామహల్ పోలీస్ స్టేడియంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: ఈరోజు తెల్లవారుజామున నగరంలోని గోషామహల్ పోలీస్‌స్టేడియంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను గోషామహల్ స్టేడియంలో భద్రపరుస్తారు. ఈ ప్రమాదంలో ఆయా వాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయిన వాహనాలన్నీ ప్రస్తుతం స్క్రాప్‌గా మారాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/