బాణసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు..ఒకరి మృతి

శివకాశి సమీపంలోని కర్మాగారంలో పేలుడు

బాణసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు..ఒకరి మృతి
fire-accident-near-sivakasi

చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. శివకాశి సమీపంలోని బాణసంచా కర్మాగారంలో మంట‌లు చెల‌రేగ‌డంతో ఒక‌రు మృతి చెందారు. ఓ పేలుడు కార‌ణంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో మ‌రికొంద‌రికి తీవ్ర‌గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది.

పేలుడు ధాటికి బాణసంచా క‌ర్మాగారంలోని ఓ గది కుప్ప‌కూలింది. ఆ స‌మ‌యంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది రెండు ఫైరింజ‌న్ల‌తో వ‌చ్చిన మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత సమాచారం అందాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/