సిఎం చంద్రబాబు నివాసా సమీపంలో అగ్నిప్రమాదం

fire accident
fire accident

విజయవాడ: ఏపి సిఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట పక్కన ఎండుగడ్డి తగులడటడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈమంటలు పక్కకు వ్యాపించడంతో అక్కడ ఉన్న అరటి తోట దగ్ధమైంది. అయితే సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది వచ్చి ప్రమాద స్థలంలో మంటలను అదుపు చేశారు. దీంతో సీఎం నివాసం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/