పొగాకు గోదాంలో మంటలు, భారీ ఆస్తి నష్టం

fire accident
fire accident


గుంటూరు: గుంటూరు నగర శివారు పొత్తూరు సమీపంలో చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 6 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంలో ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శకటాలు సరిపోకపోవడంతో యాజమాన్యం కూడా అదనంగా తెప్పించిన వాటర్‌ ట్యాంకర్లను కూడా వినియోగిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అంచనా వేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/