నిజామాబాద్‌ సూపర్‌మార్కెట్‌ లో భారీ అగ్నిప్రమాదం..

నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో కోట్ల రూపాయల ఆస్తి కాలిబూడిదైంది. ఆస్తిపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి సమయంలో మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలతో కూడిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపుచేశారు. రాత్రి ప్రమాదం జరగటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు