స్పార్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

సంగారెడ్డి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడ స్పార్‌ ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని కెమికల్‌ డ్రమ్ములు ఘర్షణకు గురై ఉండడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పరిశ్రమ మొత్తం పూర్తిగా బూడిదపాలు అయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంటలను అదుపుచేసే పనిలో అగ్పిమాపక సిబ్బంది నిమగ్నమైనారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/