పెద్ద అంబర్ పేట లో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద అంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో రసయనాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. దీంతో గోదాము నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటల ధాటికి గోదామ్‌లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో అధికారులు జేసీబీల సహాయంతో గోడలను కూల్చివేసి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ మంటల దాడికి ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. భారీగా శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.