ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

మహాభవనంలో మంటలు

MTNL office building at Bandr
MTNL office building at Bandr

ముంబయి: బాంద్రా వెస్ట్‌లో ఉన్న మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్ (ఎంటిఎన్‌ఎల్) భవనంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పది అంతస్థులున్న ఈ భవనం టెర్రస్‌పై చిక్కుకుపోయిన మొత్తం 84 మందినీ రక్షించారు. భవనం నుంచి దట్టంగా పోగ వెలువడుతుండడంతో టెర్రస్‌పై ఉన్న వారు సహాయాన్ని అర్థిస్తూ సంజ్ఞలు చేశారు. ఫైర్ బ్రిగేడ్ సెంటర్ సమీపంలో ఉన్న ఈ భవనం 3, 4 అంతస్థుల్లో మంటలు రాజుకున్నాయి. 14 అగ్నిమాపక వాహనాలు మంటల్ని ఆర్పేందుకు నియోగించామని, ఒక అంబులెన్స్; ఆరు నీళ్ల ట్యాంకర్లను, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికిల్‌ను కూడా రప్పించామని అధికారులు తెలిపారు. ఖమొత్తం భవనం దట్టమైన పొగతో నిండిపోయింది. పై అంతస్థుల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలిసింది. మంటలు ఆర్పడం, సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయిగ అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ పి. రహాంగ్‌డాలే చెప్పారు. మంటల్ని ఆర్పేందుకు బ్రిగేడ్ ఒక ఫైర్ రోబోను ఉపయోగించింది.అగ్నిమాపక దళానికి స్థానికులు తోడ్పడుతున్నారు. రక్షింపబడినవారికోసం జమాత్ ఖానాను కూడా ఏర్పాటు చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/