చైనాలో ఘోర అగ్ని ప్రమాదం

చైనా మార్షల్‌ ఆర్ట్స్‌ పాఠశాలలో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

బీజింగ్‌ : చైనాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్‌ కౌంటీలో శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 18 మందిని బలితీసుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/