నల్గొండలో భారీ అగ్నిప్రమాదం..

నల్గొండలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా..పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
చిట్యాల మండలం వెలిమినేడులో బుధవారం సాయంత్రం హిందీస్ రసాయన కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. అగ్ని ప్రమాద ఘటన తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఎగిసి పడుతుండటంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్ధం రావడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. సమీప ప్రాంతాల ప్రజలను పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది.