జమ్మూ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం
టికెట్‌కౌంటర్లు దగ్ధం

జమ్మూ: ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు జమ్మూ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఎయిర్‌పోర్టులోని టికెట్ కౌంటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ టికెట్ కౌంటర్‌లో మంటలు చెలరేగాయని, అవి మిగిలినవాటికి వ్యాపించాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను ఆర్పడానికి 45 నిమిషాలు పట్టిందని సత్వారీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిషాంత్ గుప్తా తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్కూట్ కారణమని వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఒక్కరుకూడా గాయపడలేదని చెప్పారు. ఈ అగ్నిప్రమాదం వల్ల విమానాల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం వాటిల్లలేదని జమ్మూ విమానాశ్రయ డైరెక్టరు ప్రవత్ రంజన్ చెప్పారు. దగ్థం అయిన టికెట్ కౌంటర్లకు బీమా కంపెనీల నుంచి నష్టపరిహారం వస్తుందని డైరెక్టరు చెప్పారు. అయితే విమాన సర్వీలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని, సర్వీసులను యదావిధంగా నడిపామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/