హిందూ సాధువు కంప్యూటర్‌ బాబాపై ఎఫ్‌ఐఆర్‌

Digvijay Singh, Computer Baba
Digvijay Singh, , Computer Baba

భోపాల్‌: ప్రముఖ హిందూ సాధువు కంప్యూటర్‌ బాబా ఇటివల భోపాల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి
దిగ్విజ‌య్ సింగ్‌ గెలుపు కోసం భారీ యజ్ఞాన్ని చేసిన విషయ తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు కంప్యూట‌ర్ బాబాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ఆయ‌నపై కేసు ఫైల్ చేశారు. కంప్యూట‌ర్ బాబా హ‌ట‌యోగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం బాబా య‌జ్ఞంపై ద‌ర్యాప్తు ప్రారంభించింది. కంప్యూట‌ర్ బాబా ఎవ‌రి నుంచి య‌జ్ఞం కోసం అనుమ‌తి తీసుకున్నార‌ని, ఎప్పుడు ఆ అనుమ‌తి ల‌భించింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు జ‌రిగింది. కంప్యూట‌ర్ బాబా ఏ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఈసీ తెలుసుకున్న‌ది. జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా ఎన్నిక‌ల అధికారి సుదామా ఖ‌డే దీనిపై ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. బిజెపి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు విచార‌ణ జ‌రిగింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/