ఆర్థిక ప్రణాళిక అవసరం

కాలేజీ చదువుతుండగానే క్యాంపస్‌ సెలెక్షన్లలో ఉద్యోగాలు వస్తున్నాయి. తక్కువ వయసులోనే ఉద్యోగస్తులు కావటం. కెరీర్‌లో ఎదగాలని నేటి యువత పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఉద్యోగానికి పెళ్లికి మధ్య కొంత సమయం ఉంటుంది.

Financial planning is essential

ఆ సమయంలో సరైన ప్రణాళిక ఉంటే అది ఆర్ధిక ప్రణాళిక ఉంటే మరీ మంచిది. ఆదాయమే కాదు ఖర్చు ఎంతుందో చూసుకోవాలి. ఖర్చు దేనికి ఎక్కువ పెడుతున్నామో గమనించుకోవాలి. అంత అవసరమా లేదా అది అవసరమేనా అని చూసుకోవాలి. ముందు ఖర్చు లిస్ట్‌ తయారు చేసుకోవాలి. బిల్లులు, అద్దెలు, ప్రయాణం ఖర్చులు ఇలా ప్రతిదీ రాసుకోవాలి. అప్పుడు వచ్చే ఆదాయంలో అది ఎంత శాతం ఉందో లెక్కవేసుకోవాలి.

60 శాతానికి మించకుండా ఉంటే మంచిది. అంతకన్నా తక్కువున్నా మంచిదే. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం శ్రద్ధ పెడుతున్నారు. అది మంచి విషయమే. అయితే ఇందుకు ఆరోగ్య బీమా ఉంటే మంచిది. తక్కువ వయసున్న వారికి తక్కువ ఈపయింతోనే బీమా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎడ్యుకేషన్‌ లోన్‌ లాంటివేమైనా ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమయానికి కట్టే ఇఎంఐల వల్ల ఇల్లు, లేదా కారు కొనాలన్నా రుణం ఈజీగా వస్తుంది.

ఉద్యోగస్తులకు నెల నెలా జీతం వస్తుంది. సేవింగ్స్‌ ఖాతా లేదా మ్యూచువల్‌ ఫండ్‌లను ఎంచుకుంటే ఉద్యోగ రీత్యా కంపెనీ మారాలనుకున్నా, లేదా మరే కారణమైనా కావచ్చు ఆ సమయంలో వీటిల్లో అత్యవసర నిధిగా పెట్టుకున్న మొత్తాన్ని వాడుకోవచ్చు. తక్కువ వయసులో పొదుపు చేయడం మొదలు పెడితే దాని ప్రభావం ఎంత బాగా ఉంటుందో మీకే తెలుస్తుంది. నష్టభయాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వయసులో పెట్టుబడులు ప్రారంభించడం మంచిది.

పొదుపు చేసే మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని పరిశోధించాలి. మార్గాలు ఎన్నున్నా లక్ష్యంతో ఉండాలి. దీర్ఘకాలం చేయాల్సినవి ఏమిటి, స్వల్పకాలం చేయాల్సినవి ఏమిటి అన్నది తెలుసుకోవాలి. మొదటి నుండే సరైన ఆర్థిక లక్ష్యాలు ఉంటే భవిష్యతు పయోగపడే కోర్సుల వంటి వాటిపై ఖర్చు చేసు కోవచ్చు.

డబ్బు ఉంది కదాని విలాసవంతమైన వస్తువులపై ఖర్చు తగ్గించుకోవాలి. అనవసర వ్యయాలు చేయ కూడదు. వాయి దాల పద్ధతి మంచిది. ఇవన్నీ ఉంటే భవిష్యత్తు ఆనందమయం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/