ఉద్యోగాలు కోల్పోయిన వారి గుణాంకాలు సేకరించాలి

కార్మికశాఖను కోరిన కేంద్ర ఆర్థికశాఖ

nirmala sitaraman
nirmala sitaraman

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు సేకరించాలని కార్మిక శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కోల్పోయిన ఉద్యోగాలు, వేతన కోతలపై కార్మిక మంత్రిత్వ శాఖతో ఆర్థిక శాఖ మంతనాలు జరిపిందని, గణాంకాలు అందించాలని కోరిందని ఆర్థిక శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దీనికితోడు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు, పంపిణీ చేసిన రుణాల మధ్య పొంతన లేకపోవడాన్ని కూడా ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/