రూ 64,180 కోట్లతో ఆరోగ్య రంగానికి పెద్దపీట

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆరోగ్య మౌలిక వసతులకు ఈ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రానున్న ఆరేళ్లలో రూ 64,180 కోట్లతో ఆరోగ్య పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో 2.24 లక్షల కోట్లు ఆరోగ్య రంగంలో వెచ్చిస్తామని చెప్పారు. నూతన దశాబ్ధంలో తొలి బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెడుతున్నారు. కొవిడ్‌19 కట్టడికి లాక్‌డౌన్‌ విధించకుంటే భారత్‌ భారీగా నష్టపోయి ఉండేదని 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.


బ‌డ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాల‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇందులో మొద‌టిది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ‌. రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా. మూడోది స‌మ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌. ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ ఖీ డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్ ఖీ డీ), ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న‌. ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు.

కాగా, ఆరోగ్య భార‌త్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వ‌స్త్ భార‌త్ యోజ‌న పేరుతో ఆ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఈ కొత్త ప‌థ‌కం కోసం 64,180 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆ స‌మ‌యంలో ఈ కొత్త స్కీమ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ స్కీమ్‌లో ఉన్న నిధుల‌తో ప్రైమ‌రీ, సెకండ‌రీ హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న జాతీయ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డమే కాకుండా.. కొత్త ఆరోగ్య సంస్థ‌ల‌ను స్థాపించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి సీతారామ‌న్ వెల్ల‌డించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/